Pawan Kalyan: పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం సరికాదు!: ఏపీ మంత్రి నారాయణ

  • జగన్ కేసుల మాఫీకోసం మౌనంగా ఉన్నారు
  • ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ 75 వేల కోట్లు రావాలని చెప్పింది
  • నెల్లూరులో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీని పల్లెత్తు మాట కూడా అనడం లేదని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. ఏపీకి దాదాపు రూ.75,000 కోట్లు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చిందని గుర్తుచేశారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ ప్రయోజనాల విషయంలో మౌనం వహించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో మంత్రి నారాయణ ఈరోజు మీడియాతో మాట్లాడారు.

ఏపీ ప్రయోజనాల విషయంలో కలిసి పోరాటం చేయడం సరైన మార్గమని తాను భావిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీతో కలిసి రావాలా? వద్దా? అన్నది ఆయా వ్యక్తుల ఇష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఒంటరిగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తెరవెనుక ఆడుతున్న నాటకానికి ప్రజలు 2019లో ముగింపు పలుకుతారని జోస్యం చెప్పారు.

More Telugu News