Australia: పట్టుబిగిస్తున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్

  • 24/0 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్
  •  బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచుతున్న భారత్
  • 152 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టిమ్ సేన

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 622/7 వద్ద డిక్లేర్ చేసిన అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్  రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ప్రారంభించిన కంగారూలు జాగ్రత్తగా ఆడుతూ పరుగులు పెంచే ప్రయత్నం చేశారు.

అయితే, 72 పరుగుల వద్ద ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా (27)ను కుల్దీప్ పెవిలియన్ పంపాడు. ఇక ఆ తర్వాతి నుంచి భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్‌పై ఒత్తిడి పెంచారు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న మార్కస్ హారిస్‌ (79), షాన్ మార్ష్ (8)లను రవీంద్ర జడేజా పెవిలియన్ పంపగా, మార్నస్ లాబుస్‌చగ్నే (38)ను షమీ ఔట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి భారత్ కంటే 451 పరుగులు వెనకబడి ఉంది. ట్రావిస్ హెడ్ (11), పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (8) క్రీజులో ఉన్నారు.

More Telugu News