AAP: ‘ఆప్’ నుంచి బయటకొచ్చిన ఫూల్కా సంచలన వ్యాఖ్యలు

  • అన్నా హజారే ఉద్యమాన్ని పార్టీగా మార్చి తప్పు చేశారని వ్యాఖ్య
  • ఆరు నెలల్లో ఓ సంస్థ ఏర్పాటు
  • లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్‌ నేత, సీనియర్ అడ్వకేట్ హెచ్ఎస్ ఫూల్కా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాజీనామా చేసిన ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని 2012లో రాజకీయ పార్టీ (ఆప్)గా మార్చడం పెద్ద పొరపాటని పేర్కొన్నారు. పంజాబ్‌లో మరో ఆరు నెలల్లో తానో సంస్థను ప్రారంభిస్తానని, అది అన్ని పార్టీలకు ‘సమాంతర శక్తి’ (ప్యారలెల్ ఫోర్స్)గా పనిచేస్తుందని తెలిపారు.

ఎనిమిదేళ్ల క్రితం అన్నా హాజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్ని రాజకీయ పార్టీలకు సమాంతరశక్తిగా కనిపించిందని పేర్కొన్న ఫూల్కా.. దానిని రాజకీయ పార్టీగా మార్చి తప్పు చేశారని ఇప్పుడు అనిపిస్తోందన్నారు. ఉద్యమం ముగిసిపోలేదని, మళ్లీ  అటువంటి ఉద్యమమే రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఆరు నెలల్లో పంజాబ్‌లో తానో సంస్థను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఇది అన్ని పార్టీలకు ‘సమాంతర శక్తి’గా పనిచేస్తుందని పేర్కొన్న ఫూల్కా రానున్న లోక్‌సభ  ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. 

AAP

More Telugu News