Gangstar: గ్యాంగ్‌స్టర్ నయీంకు రూ. 1200 కోట్ల ఆస్తి.. లెక్క తేల్చిన ఆదాయపు పన్ను శాఖ

  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూములు
  • 1.67 లక్షల చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు
  • ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తులు విలువ రూ.1200 కోట్ల వరకు ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ లెక్క తేల్చింది. నయీం, అతడి బినామీల పేరున ఉన్న ఆస్తులను గుర్తించిన అధికారులు వాటి విలువను రూ. 1200 కోట్లుగా లెక్క తేల్చారు. వీటన్నింటినీ అటాచ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆస్తుల అటాచ్‌మెంట్ కోరుతూ ఢిల్లీలోని ఎడ్జ్యుడికేటింగ్‌ అథారిటీలో ఐటీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు.

ఐటీ అధికారుల లెక్క ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నయీంకు స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో 1015 ఎకరాల భూములు, 1.67 లక్షల చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు, హైదరాబాద్‌లోని నయీం డెన్‌లో రూ. 2,08,52,400 నగదు, 1.90 కిలోల బంగారు నగలు, 873 గ్రాముల వెండి వస్తువులు ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం.. వీటి మొత్తం విలువ రూ. 1200 కోట్ల పైమాటేనని ఐటీ అధికారులు తెలిపారు.

More Telugu News