Pawan Kalyan: కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడుతున్నారు: పవన్ కల్యాణ్

  • కులాలు లాభపడటం లేదు
  • ప్రవాహం లాంటోడిని.. నన్నెవరూ ఆపలేరు
  • బాధ్యత, సహనం ఉంటేనే రాణిస్తాం

కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడుతున్నారు తప్ప, కులాలు లాభపడటం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాపోయారు. తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలతో నేటి సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... తాను ప్రవాహం లాంటి వాడినని.. తననెవరూ ఆపలేరని అన్నారు. ఒకట్రెండు కులాలను అడ్డుపెట్టుకుని ఎవరూ విజయం సాధించలేరని పవన్ పేర్కొన్నారు. బాధ్యత, సహనం ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తామని.. చిన్ననాటి నుంచే తాను ఈ లక్షణాలను అలవర్చుకుని రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.  

More Telugu News