sensex: చివరి రెండు గంటల్లో కొనుగోళ్ల ఊపు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • ఉదయం నుంచి ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు
  • 181 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 55 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. అయితే, చివరి రెండు గంటల్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో... మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 181 పాయింట్లు లాభపడి 35,695కి పెరిగింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 10,727 వద్ద స్థిరపడింది.

వేదాంత, యస్ బ్యాంక్, టాటా మోటార్స్, భారతి ఎయిర్ టెల్, ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్ తదితర కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి. టెక్ మహీంద్రా, హెచ్సీఎల్, హీరో మోటో కార్ప్, టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. 

More Telugu News