moon: చందమామ ఆవలి వైపు ఫొటోను విడుదల చేసిన చైనా!

  • నిన్న చంద్రుడిపై ల్యాండైన చంఘీ-4 రోవర్
  • అమెరికా, రష్యాలకు సాధ్యంకాని రికార్డు
  • సమీపం నుంచి ఫొటో తీసిన చైనా రోవర్

చైనా ఇటీవల ప్రయోగించిన ఛంఘీ-4' (చైనా పురాణాల్లో చంద్ర దేవత) రోవర్ (వ్యోమనౌక) చంద్రుడి ఆవలి వైపున నిన్న విజయవంతంగా ల్యాండై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యలైన అమెరికా, రష్యాలకు సాధ్యం కాని అద్భుతాన్ని చైనా ఈ ప్రయోగంతో సుసాధ్యం చేసింది.

తాజాగా చైనా ప్రయోగించిన ఛంఘీ-4.. చంద్రుడికి సంబంధించిన కీలక ఫొటోను భూమిపైకి పంపించింది. చంద్రుడి నిర్మాణంపై సమీపం నుంచి తీసిన ఫొటోను పంపించింది. భూమిపై ఉన్నవారికి ఎప్పుడూ చంద్రుడి ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. భూభ్రమణ కాలం, చంద్రుడి భ్రమణకాలంతో సమానం కావడంతో భూమిపై ఉన్నవాళ్లు చంద్రమామ రెండోవైపును చూడలేరు. తాజాగా ఇక్కడ ఉన్న రహస్యాలను ఛేదించేందుకు చైనా ఛంఘీ-4ను ప్రయోగించింది.

More Telugu News