Jagan: జగన్ దాడి కేసులో ముగిసిన శ్రీనివాసరావు రిమాండ్.. ఎన్ఐఏకు అప్పగించే అవకాశం!

  • నేడు హైకోర్టు ముందు హాజరు
  • విజయవాడలో కొనసాగనున్న విచారణ
  • గతేడాది అక్టోబర్ 25న జరిగిన దాడి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ నేటితో ముగిసింది. ఈ కేసులో ఏకైక నిందితుడు కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అతడిని జైలులోనే ఉంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతున్నారు. మరోవైపు జగన్ కేసును హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది.

ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును పోలీసులు మరికాసేపట్లో హైకోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తారా? లేక మరోసారి రిమాండ్ కు తరలిస్తారా? అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఏపీలో విజయవాడలోనే ఎన్ఐఏ కోర్టు ఉండటంతో ఈ కేసు విశాఖ నుంచి విజయవాడ పట్టణానికి బదిలీ చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే.

More Telugu News