High Court: జగన్ పై కేసుల విషయంలో చంద్రబాబు చెప్పిందే జరిగింది!

  • హైకోర్టు విడిపోతే కేసు మొదటికి వస్తుంది
  • విచారణను ఆలస్యం చేసేందుకు బీజేపీ కుట్ర
  • ఇటీవలే వ్యాఖ్యానించిన చంద్రబాబు

వైఎస్ జగన్ పై కోర్టులో నడుస్తున్న కేసుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అంచనాయే నిజమైంది. తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విడిపోతే, జగన్ కేసుల విచారణ తిరిగి మొదటికి వస్తుందని, కేసుల విచారణను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు జగన్ తో కలిసి బీజేపీ కుట్ర చేసిందని ఇటీవల చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. హైకోర్టు భవనం పూర్తికాకుండా విభజనను పూర్తి చేశారని, హడావుడిగా కోర్టులను తరలించాల్సి వచ్చిందని కూడా ఆయన ఆరోపించారు.

న్యాయమూర్తుల పంపకంలో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసులను విచారిస్తున్న జస్టిస్ వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే న్యాయమూర్తి తిరిగి విచారణ చేపట్టక తప్పనిసరి పరిస్థితి. ఇక, జగన్ పై ఉన్న కేసులను అమరావతికి తరలించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసులు ఉమ్మడి రాష్ట్రంలో జరగడం, అటాచ్ అయిన జగన్ ఆస్తులు హైదరాబాద్ లోనే ఉండటం కారణంగా విచారణ నాంపల్లిలోని సీబీఐ కోర్టులోనే సాగాల్సివుందని చెబుతున్నారు.

More Telugu News