modi: మోదీకి సవాల్ విసిరిన ఏపీ మంత్రి నారాయణ

  • ఏపీకి ఇచ్చిన నిధులు మోదీ సొంత డబ్బు కాదు
  • మనం కట్టిన పన్నుల్లో కొంత శాతాన్ని వెనక్కు ఇస్తున్నారు
  • నీతి ఆయోగ్ సిఫారసులకే దిక్కు లేదు

ప్రధాని మోదీపై ఏపీ మంత్రి నారాయణ మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మోదీ సొంత డబ్బు కాదని ఎద్దేవా చేశారు. మనం కట్టిన పన్నుల్లో 47 శాతం నిధులను జనాభా దామాషా ప్రకారం 14వ ఆర్థిక సంఘం తిరిగి ఇస్తుందని చెప్పారు.

తన సొంత శాఖ నుంచి అమరావతి నిర్మాణానికి నిధులను విడుదల చేశామని... వీటికి యూసీలను కూడా సమర్పించామని తెలిపారు. వాటిని పరిశీలించి వెంటనే నిధులను విడుదల చేయాలని నీతి అయోగ్ కూడా సిఫారసు చేసిందని... నీతి ఆయోగ్ సిఫారసులకే దిక్కులేదని మండిపడ్డారు. అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన 6 హామీలు, విభజన చట్టంలోని 18 అంశాలపై బహిరంగ చర్చకు మోదీ సిద్ధం కావాలని సవాలు విసిరారు.

More Telugu News