Narendra Modi: నరేంద్ర మోదీ బయోపిక్ కి టైటిల్ ఖరారు

  • మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ 
  • ఈ నెల 7వ తేదీన ఫస్టులుక్ 
  • 2వ వారంలో షూటింగ్ మొదలు     

బాలీవుడ్ లో బయోపిక్ ల జోరు మరింత ఊపందుకుంటోంది. ఇప్పటికే కొన్ని బయోపిక్ లు సెట్స్ పై ఉండగా, మరికొన్ని బయోపిక్ లు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. నరేంద్ర మోదీ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకి 'పీఎమ్ నరేంద్ర మోదీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

సందీప్ సింగ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదలనున్నారు. ఈ నెల 2వ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఒక సాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోదీ, అంచలంచెలుగా ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయికి రావడం వెనుక ఆయన కృషి .. పట్టుదల .. లక్ష్య సాధన ఎంతో వున్నాయి. వాటన్నింటినీ ఈ బయోపిక్ లో చూపించనున్నారట.       

More Telugu News