Tapsee: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హిందీ చిత్రం నుంచి తప్పుకున్న తాప్సీ
  • చిరంజీవి, కొరటాల శివ సినిమా అప్ డేట్ 
  • ఏభయ్యవ చిత్రానికి రెడీ అవుతున్న ఉపేంద్ర 

*  ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో బిజీగా వున్న కథానాయిక తాప్సీ తాజాగా ఓ హిందీ చిత్రం నుంచి బయటకు వచ్చేసింది. అనురాగ్ బసు దర్శకత్వం వహించే చిత్రం నుంచి ఆమె తప్పుకుంది. డేట్స్ సమస్య వల్ల ఈ ప్రాజక్టు నుంచి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది.
*  ప్రస్తుతం 'సైరా' సినిమాలో నటిస్తున్న చిరంజీవి దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. స్క్రిప్ట్ కూడా రెడీ అయిన ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది వేసవిలో మొదలుకానున్నట్టు సమాచారం.
*  తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర తన ఏభయ్యవ చిత్రానికి రెడీ అవుతున్నాడు. 'అధిర' పేరిట రూపొందే ఈ చిత్రంలో తాను నటించడమే కాకుండా, దీనికి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషలలో దీనిని రూపొందిస్తున్నారు.

More Telugu News