bellamkonda srinivas: 'రాచ్చసన్' రీమేక్ కూడా ఆ హీరో దగ్గరికే వెళ్లి ఆగిందట!

  • తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'
  • చిన్న సినిమా అయినా పెద్ద హిట్
  • తెలుగు రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్   

క్రితం ఏడాది తమిళంలో తక్కువ బడ్జెట్లో నిర్మితమై .. భారీ లాభాలను తెచ్చిపెట్టిన చిత్రాల జాబితాలో 'రాచ్చసన్' ఒకటిగా కనిపిస్తుంది. విష్ణు విశాల్ .. అమలాపాల్ జంటగా నటించిన ఈ సినిమా, క్రితం ఏడాది అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా థియేటర్లకు వెళ్లిన 'రాచ్చసన్' 20 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో నితిన్ కొన్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఈ రీమేక్ హక్కులు చేతులు మారినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. దర్శకనిర్మాతలు ఎవరన్నది తెలియదుగానీ, ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికే వెళ్లి ఆగిందని అంటున్నారు. ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించడం జరిగిపోయిందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

More Telugu News