Shahrukh Khan: ఆసక్తిని రేకెత్తించే భారీ బయోపిక్ లో షారుక్

  • షారుక్ ఖాన్ తదుపరి సినిమాగా 'సెల్యూట్' 
  • ముంబై ఫిల్మ్ సిటీలో భారీ సెట్ 
  • ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగు మొదలు 

షారుక్ ఖాన్ నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జీరో' ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. షారుక్ చేసిన ప్రయోగాత్మక ప్రయత్నానికి ప్రశంసలు లభించాయి. అయితే వసూళ్ల పరంగా ఈ సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. తన కెరియర్లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన షారుక్, ఈ సినిమా పరాజయాన్ని అంతగా పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు.

తొలి భారతీయ వ్యోమగామి 'రాకేశ్ శర్మ' జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్ లో షారుక్ నటిస్తాడు. ఈ సినిమాకి 'సెల్యూట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. భారీ బడ్జెట్ తో సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, మహేశ్ మతాహి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ కోసం ముంబై ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నారట. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

More Telugu News