Andhra Pradesh: అగ్రిగోల్డ్ ఆస్తులను చవగ్గా కొట్టేసేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారు! ఆళ్ల నాని

  • బాధితులను ఆదుకోవాలన్న ధ్యాస ప్రభుత్వానికి లేదు
  • వెంటనే రూ.1,100 కోట్లు విడుదల చేయండి
  • ఏలూరులో ఆందోళన చేపట్టిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలన్న ధ్యాస టీడీపీ ప్రభుత్వానికి లేకుండా పోయిందని వైసీపీ నేత, ఎమ్మెల్సీ ఆళ్ల నాని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం తక్షణం రూ.1,100 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారనీ, ఇందుకోసం తక్కువ ధరకు ఆస్తులను కొనుగోలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

ఏలూరులోని కలెక్టరేట్ వద్ద ఈరోజు వైసీపీ శ్రేణులతో కలిసి అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా నాని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ వైసీపీ పోరాడుతుందనీ, అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

More Telugu News