'ఆర్ ఎక్స్ 100' దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!

03-01-2019 Thu 14:52
  • తేజ దర్శకత్వంలో 'సీత' సినిమా 
  • తదుపరి సినిమా రమేశ్ వర్మతో 
  • ఆ తరువాత అజయ్ భూపతితో సెట్స్ పైకి    
బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి నుంచి కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు తన సినిమాల్లో వుండేలా చూసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో 'సీత' అనే నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రంలో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా చెప్పాడు. దర్శకుడు అజయ్ భూపతికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది తాజా సమాచారం.

అజయ్ భూపతి తెరకెక్కించిన 'ఆర్ ఎక్స్ 100' సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్  అయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. అలాంటి అజయ్ భూపతితో కలిసి పనిచేయడానికి యువ హీరోలంతా ఎంతో ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి ఒక కథను బెల్లంకొండ శ్రీనివాస్ కి వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయట. రమేశ్ వర్మ ప్రాజెక్టు తరువాత ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.