rafel: 'రాఫెల్ ఎగ్జామ్ పేపర్' విడుదల చేసిన కాంగ్రెస్.. 1600 కోట్ల మార్కులకు పరీక్ష

  • రాఫెల్ డీల్ పై దాడిని తీవ్రతరం చేసిన కాంగ్రెస్
  • 'రాఫెల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్... కరప్షన్ అనాలిసిస్' పేరుతో ప్రశ్నలు
  • మనోహర్ పారికర్ వద్ద ఉన్న ఫైల్ లో ఏముందంటూ ప్రశ్న

రాఫెల్ యుద్ధ విమానాల డీల్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ దాడిని తీవ్రతరం చేసింది. ఈ అంశాన్ని ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో అస్త్రంగా మలచుకున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు సోషల్ మీడయాలో ఓ ప్రశ్నాపత్రాన్ని విడుదల చేసింది. 'రాఫెల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్... కరప్షన్ అనాలిసిస్' పేరుతో ప్రశ్నలను సంధించింది. ఈ పరీక్షకు 24 గంటల సమయాన్ని నిర్ణయించింది. 1600 కోట్ల మార్కులకు పరీక్షను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. కింద ఉన్న నాలుగు ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వాలని కోరింది.

ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు ఇవే:

  • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు 126 యుద్ధ విమానాలు అవసరమైతే... కేవలం 36 మాత్రమే ఎందుకు కొంటున్నారు?
  • ఒక్కో యుద్ధ విమానాన్ని రూ. 560 కోట్లతో కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పుడు... ఒక్కో దానికి రూ. 1600 కోట్లు ఎందుకు వెచ్చిస్తున్నారు?
  • హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను కాకుండా అనిల్ అంబానీని ఎందుకు ఎంచుకున్నారు?
  • మోదీ గారు... రాఫెల్ ఫైల్ ను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (మాజీ రక్షణ మంత్రి) తన బెడ్ రూమ్ లో ఎందుకు ఉంచుకున్నారు? ఆ ఫైల్ లో ఏముంది?

More Telugu News