Supreme Court: ముందు హైకోర్టు, తరువాతే మేము... రమణ దీక్షితులుకు సుప్రీంలో ఎదురుదెబ్బ!

  • విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి
  • సుప్రీంకోర్టులో రమణ దీక్షితులు పిటిషన్
  • హైకోర్టుకు వెళ్లాలని సూచించిన ధర్మాసనం

తనను తిరిగి విధుల్లోకి తీసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ఆదేశించాలని కోరుతూ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు వేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు, ఆయనకు ఊరటను ఇవ్వలేదు. అక్రమంగా తనను స్వామి వారి సేవ నుంచి తొలగించారంటూ రమణ దీక్షితులు వేసిన పిటిషన్‌ పై, ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ విచారణ జరిపారు. ఈ పిటిషన్ తో హైకోర్టుకు వెళ్లాలని సూచించారు.

ముందుగా హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని రమణ దీక్షితులు తరపు న్యాయవాదిని ఆయన ప్రశ్నించారు. హైకోర్టులో న్యాయం జరగే పరిస్థితి లేదని, గతంలో తాము హైకోర్టును ఆశ్రయించిన వేళ, ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అసంతృప్తికరంగా ఉందని రమణ దీక్షితులు తరఫు న్యాయవాది వాదించారు. దీంతో ఏకీభవించని ధర్మాసనం, ముందుగా హైకోర్టులో పిటిషన్ వేయాలని, ఆ తరువాతే సుప్రీంకు రావాలని తేల్చి చెప్పారు.

More Telugu News