allu arjun: బన్నీకి హీరోయిన్ దొరికేసినట్టే!

  • 'భరత్ అనే నేను'తో పరిచయం
  • యూత్ లో విపరీతమైన క్రేజ్ 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి  

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తన తదుపరి సినిమాను చేయడమనేది ఖరారైపోయింది. గీతా ఆర్ట్స్ .. హారిక అండ్ హాసిని కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. తండ్రీ కొడుకుల బంధానికి సంబంధించిన ఎమోషన్ ప్రధానంగా ఈ కథ సాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా చోటు సంపాదించుకునే అదృష్టవంతురాలు ఎవరనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో కైరా అద్వాని పేరు తెరపైకి వచ్చింది. కథానాయిక పాత్ర కోసం ఈ సినిమా టీమ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతోందట. బన్నీ జోడీగా ఛాన్స్ అంటే ఆమె కాదనే అవకాశం ఉండదు కనుక, ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని చెప్పుకుంటున్నారు. 'భరత్ అనే నేను' తో తెలుగు తెరకి పరిచయమైన ఈ సుందరి, త్వరలో 'వినయ విధేయ రామ' సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. వచ్చేనెలలో బన్నీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనుంది.  

More Telugu News