sandalwood: కుమారస్వామి భార్యతో పాటు.. కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ అధికారుల పంజా

  • బెంగళూరులోని 60 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు
  • పునీత్ రాజ్ కుమార్, రాధిక నివాసాల్లో రెయిడ్స్
  • ఈ ఉదయం నుంచి కొనసాగుతున్న సోదాలు

కన్నడి సినీ పరిశ్రమపై ఐటీ అధికారులు పంజా విసిరారు. మెరుపు దాడులకు దిగారు. ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకుల ఇళ్లలో సోదాలను నిర్వహిస్తున్నారు. బెంగళూరులోని దాదాపు 60 ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్, ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, సినీ నటి రాధిక ఇళ్లతో పాటు పలువురి నివాసాలను అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాల అంశం కన్నడ నాట హాట్ టాపిక్ గా మారింది. 

More Telugu News