ranveer: 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'టెంపర్' రీమేక్

  • రోహిత్ శెట్టి నుంచి 'సింబా'
  • రణ్ వీర్ జోడీగా సారా అలీఖాన్ 
  • అయిదు రోజుల్లో 124 కోట్లు

రణ్ వీర్ సింగ్ .. సారా అలీఖాన్ జంటగా హిందీలో 'సింబా' సినిమా తెరకెక్కింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరణ్ జొహార్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్' సినిమాకి రీమేక్. విడుదలైన రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

 దేశ వ్యాప్తంగా ఈ సినిమా తొలి అయిదు రోజుల్లోనే 124 కోట్లను రాబట్టింది. ఇలా చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. వివాహమైన తరువాత రణ్ వీర్ అందుకున్న భారీ విజయం ఇది. బలమైన కథాకథనాలు .. రణ్ వీర్ యాక్షన్ .. సారా అలీఖాన్ గ్లామర్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సారా అలీఖాన్ బిజీ కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మొత్తానికి 'టెంపర్' కథ హిందీలోనూ విజయవిహారం చేస్తోందన్న మాట. 

More Telugu News