Lok Sabha: వారణాసిని వదిలి పూరీని ఎంచుకోనున్న నరేంద్ర మోదీ?

  • లోక్ సభ ఎన్నికల్లో పూరీ నుంచి పోటీ
  • 90 శాతం చాన్స్ ఉందన్న బీజేపీ నేత ప్రదీప్ పురోహిత్
  • భారీ మెజారిటీ ఖాయమన్న పూరీ బీజేపీ అధ్యక్షుడు

ప్రస్తుతం వారణాసి ఎంపీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఈ సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఒడిశాలోని మరో పుణ్యక్షేత్రమైన పూరీని ఎంచుకోనున్నారా? అంటే, అవుననే అంటున్నారు భారతీయ జనతా పార్టీ నేత ప్రదీప్ పురోహిత్. ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుంచి మోదీ పోటీ పడేందుకు 90 శాతం అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే, తుది నిర్ణయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

గత సంవత్సరం అక్టోబర్ లో ప్రధాని మోదీతో సమావేశమైన ఒడిశా బీజేపీ యూనిట్, పూరీ నుంచి పోటీ చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఒడిశా ప్రజలపై ప్రధానికి చాలా వాత్సల్యముందని, అందువల్ల తదుపరి ఎన్నికల్లో ఆయన ఈ సీటునే ఎంచుకోవచ్చని ప్రదీప్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే విషయమై స్పందించిన పూరీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రభంజన్ మోహాపాత్ర, మోదీ పూరీ నుంచే పోటీ పడతారని భావిస్తున్నానని అన్నారు. ఇక్కడి పరిస్థితులను బీజేపీ నేతలు నిత్యమూ పరిశీలిస్తున్నారని, మోదీ పోటీ పడితే భారీ మెజారిటీ ఖాయమని అన్నారు.

More Telugu News