KCR: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు తప్పని ఎదురుచూపులు.. ఇప్పుడు వద్దన్నఈసీ

  • తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
  • రైతు బంధు చెక్కుల పంపిణీ స్టాప్
  • అసెంబ్లీ సమావేశాలకు అనుమతి తప్పనిసరి

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లో ఉండడంతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టవద్దంటూ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సూచించింది. అలాగే, అసెంబ్లీ సమావేశాలకు కూడా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ప్రభుత్వ పథకాలైన బతుకమ్మ చీరల పంపిణీ, రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ నిలిపివేయాలని, అధికారుల బదిలీలు చేపట్టవద్దని సూచించింది. అయితే, పాలకమండళ్లు ఉన్నచోట మాత్రం జిల్లా, మండల, మునిసిపల్ సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు చెప్పిన ఈసీ జిల్లాలు, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.

More Telugu News