vijay: విజయ్ సినిమాలో 16 మంది కొత్త అమ్మాయిలు!

  • స్పోర్ట్స్ నేపథ్యంలో అట్లీ కుమార్ మూవీ 
  • కోచ్ పాత్రలో కనిపించనున్న విజయ్
  • మొదలైన ప్రీ ప్రొడక్షన్ పనులు  

క్రితం ఏడాది చివర్లో 'సర్కార్' సినిమాతో విజయ్ సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఆయన దర్శకుడు అట్లీ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్రకి గాను నయనతారను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట.

16 మంది అమ్మాయిలు కలిగిన టీమ్ కి విజయ్ కోచ్ గా వ్యవహరిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం 16 మంది కొత్త అమ్మాయిలనే తీసుకోవాలనే ఆలోచనలో అట్లీ కుమార్ వున్నాడని చెబుతున్నారు. ఆ అమ్మాయిల పాత్రలకి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయట. వివేక్ తో పాటు యోగిబాబు నటించనున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగు కోసం సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో విజయ్ .. అట్లీ కుమార్ కాంబినేషన్లో వచ్చిన 'మెర్సల్' భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాపై అంచనాలు వున్నాయి.

More Telugu News