rafel deal: మళ్లీ సుప్రీం కోర్టు ముంగిటకు రాఫెల్‌ వివాదం.. రివ్యూ పిటిషన్‌ దాఖలు

  • బీజేపీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చిన ఎపెక్స్‌ కోర్టు
  • తీర్పును సవాల్‌  చేసిన యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరి, న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌
  • కేంద్రం తప్పుడు వివరాలు ఇచ్చిందని ఆరోపణ

రాజకీయ దుమారానికి కారణమైన రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం మళ్లీ సుప్రీం కోర్టు గడపతొక్కింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో బీజేపీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇస్తూ గత ఏడాది డిసెంబరు 14న తీర్పుఇచ్చిన విషయం తెలిసిందే. రాఫెల్‌ ఒప్పందం ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించడం లేదని కోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది.

యుద్ధ విమానాల ఆవశ్యకత, నాణ్యతపై ఎటువంటి అనుమానాలు లేవని, ఒప్పందం రద్దు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సీనియర్‌ నాయకులు యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరి, న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌లు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని, అందువల్ల తీర్పును పున:సమీక్షించాలని తమ పిటిషన్‌లో కోరారు. తమ రివ్యూ పిటిషన్‌పై బహిరంగ న్యాయస్థానంలో విచారణ జరిపించాలని పిటిషన్‌ దారులు కోర్టుకు విన్నవించారు.

More Telugu News