Crude Oil: ఇదేం విడ్డూరం... రూ. 58కి లీటరు విమాన ఇంధనం, పెట్రోలు మాత్రం రూ. 73!

  • గణనీయంగా తగ్గిన క్రూడాయిల్ ధర
  • కిలోలీటరుకు రూ. 9,990 తగ్గిన ఏటీఎఫ్ ధర
  • పెట్రోలు, డీజిల్ కన్నా తక్కువకే విమాన ఇంధనం
  • లాభాలను దండుకుంటున్న విమానయాన సంస్థలు

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో క్రూడాయిల్ ధర గణనీయంగా తగ్గగా, ఇండియాలో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు ఇంకా ఆకాశంలోనే ఉన్నాయి. గడచిన నెలన్నరగా 'పెట్రో' ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ఇంటర్నేషనల్ ట్రెండ్స్ తో పోలిస్తే అది తక్కువేనని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు ఇండియాలో పెట్రోలు ధర కన్నా విమాన ఇంధన ధరే ఎక్కువ కాబట్టి. ప్రస్తుతం విమాన ఇంధన ధర లీటరుకు రూ. 58.07కు చేరడంతో విమానయాన సంస్థలు లాభాలను పిండుకుంటున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 73కు అటూఇటుగా ఉంది. అంటే, విమాన ఇంధనంతో పోలిస్తే, పెట్రోలు ధర లీటరుకు రూ. 15 అధికంగా ఉన్నట్టు. డీజిల్ ధర రూ. 68గా ఉండగా, అది కూడా విమాన ఇంధన ధరతో పోలిస్తే రూ. 10 అధికంగా ఉన్నట్టు.

అక్టోబర్ 18 నుంచి ధరలు తగ్గుతూ వస్తుండగా, ఇప్పటివరకూ లీటరు పెట్రోలుపై రూ. 14.18, డీజిల్ పై రూ. 13.03 మేరకు ధర తగ్గింది. ఇక మంగళవారం నాడు కిలో లీటర్ (1000 లీటర్లు) విమాన ఇంధనంపై రూ. 9,990 మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తెలపడంతో విమాన ఇంధన ధర రూ. 58,060.97కు దిగి వచ్చింది. ఈ ధర పెట్రోలు, డీజిల్ కన్నా తక్కువగా ఉండటం గమనార్హం.

More Telugu News