janmabhoomi: మొత్తం పది రోజులు...ఒక్కో రోజు ఒక్కో అంశంపై సభ: జన్మభూమి షెడ్యూల్‌

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి నుంచి 11వ తేదీ వరకు కార్యక్రమం
  • అన్ని జిల్లాల కార్యక్రమాల్లోనూ పాల్గొననున్న సీఎం
  • ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాలపైనా చర్చ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జన్మభూమి-మావూరు’ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి  చొరవ చూపడం, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం, పలు పథకాల లబ్ధిదారులకు ప్రయోజనం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈనెల 11వ తేదీ వరకు మొత్తం పది రోజులపాటు జరిగే కార్యక్రమంలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఒక్కోరోజు ఒక్కోదానిపై సభల్లో చర్చించాలని కూడా నిర్ణయించారు.

తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే సభలో పాల్గొని కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. తొలిరోజు రాష్ట్ర పునర్విభజన అంశంపై చర్చిస్తారు. లబ్ధిదారులకు పెన్షన్లు, రేషన్‌ కార్డులు, నిరుద్యోగభృతి పంపిణీ చేస్తారు. ఇళ్ల స్థలాల కమబద్ధీకరణ పట్టాలు అందిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో ఈ పది రోజల్లో కనీసం ఒక్క సభలోనైనా తాను పాల్గొనాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో అధికారులు సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News