anasuya: టాటూ గురించి అడిగిన అభిమానికి అనసూయ సమాధానం

  • నా వంటిపై వున్న టాటూ 'నిక్కూ'
  • తొలి పారితోషికం 5,500
  • ఆ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది    

ఇటు బుల్లితెర .. అటు వెండితెర ప్రేక్షకులను అనసూయ తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది. యూత్ లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి అనసూయ న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న ట్విట్టర్ ద్వారా అభిమానులతో చాట్ చేసింది. 'మీ వంటిపై వున్న టాటూ ఏమిటీ? మీ మొదటి పారితోషికం ఎంత?' అని ఒక అభిమాని ఆమెను ప్రశ్నించాడు.

అందుకు అనసూయ స్పందిస్తూ .. 'నా వంటిపై వున్న టాటూ 'నిక్కూ' .. అది మా ఆయన ముద్దు పేరు'. ఇక నేను అందుకున్న తొలి పారితోషికం 5,500 అని చెప్పింది. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా వస్తోన్న 'యాత్ర'లో మీ పాత్ర ఏమిటి?' అనే ప్రశ్నకి మాత్రం అనసూయ సమాధానాన్ని దాచేసింది. ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పను. ఆ పాత్ర నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని మాత్రం చెప్పగలను" అని అంది. 'యాత్ర'లో అనసూయ చేసిన పాత్ర ఎలాంటిదనే ఆసక్తి ఆమె అభిమానుల్లో ఇప్పుడు మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Telugu News