Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తీవ్రవాది పాత్రలో అందాలతార 
  • కొరటాల శివ లో-బడ్జెట్ సినిమా 
  • హిందీ సినిమా రీమేక్ లో నాగ చైతన్య

*  అందాల సాయిపల్లవి మావోయిస్టు పాత్రలో నటించనుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందే 'విరాటపర్వం 1992' చిత్రంలో సాయిపల్లవి నక్సలైట్ గా కనిపిస్తుందట. ఇందులో రానా పోలీస్ గా కనిపిస్తాడు. ఈ వారంలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుంది.
*  నిర్మాతలుగా మారుతున్న దర్శకుల జాబితాలోకి కొరటాల శివ కూడా చేరుతున్నాడు. తాజాగా ఓ లో-బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. చిరంజీవితో తాను చేయనున్న చిత్రానికి ఇంకా సమయం ఉండడంతో ఈలోగా మూడు నెలల్లో నిర్మాణం పూర్తయ్యేలా ఓ చిన్న చిత్రాన్ని నిర్మిస్తాడట.
*  అక్కినేని నాగ చైతన్య ఓ హిందీ రీమేక్ లో నటించనున్నాడు. గతేడాది హిందీలో వచ్చిన 'బరేలీకీ బర్ఫీ' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి రచయిత కోన వెంకట్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్రకు చైతూని తీసుకుంటున్నారట.

More Telugu News