kalva: బులంద్‌షహర్‌ ఘర్షణలలో ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్!

  • ఆవుల వధింపుపై నిరసనలు
  • సుబోధ్‌ను గొడ్డలితో నరికిన కల్వా
  • కాల్పులతో హత్య చేసిన ప్రశాంత్

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆవులను అక్రమంగా వధించారంటూ డిసెంబర్ 3న నిరసనలు తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన గొడవలో ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ యోగేశ్‌రాజ్‌ను పేర్కొన్న పోలీసులు.. అనంతరం కల్వా అనే వ్యక్తిని అసలు నిందితుడిగా పేర్కొన్నారు. నేడు పోలీసులు కల్వాను అదుపులోకి తీసుకున్నారు.

అల్లర్ల సమయంలో సుబోధ్‌పై కల్వా గొడ్డలితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆయన చేతి వేళ్లను నరికేందుకు యత్నించాడు. ఆ తర్వాత ప్రశాంత్ నట్ అనే వ్యక్తి సుబోధ్‌పై కాల్పులు జరిపి హత్య చేసినట్టు తేలింది. ప్రశాంత్‌ను డిసెంబర్ 28నే అదుపులోకి తీసుకున్నారు. సుబోధ్‌పై దాడి చేసేందుకు ఉపయోగించిన గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News