Uttar Pradesh: కుంభమేళాలు దళిత, గిరిజన, ముస్లింలకు తిండిపెడతాయా?: యోగి సర్కారుపై సావిత్రిబాయి విమర్శలు

  • ఉద్యోగాలు, హక్కుల కోసం మేము పోరాడుతున్నాం
  • యూపీ ప్రభుత్వం కుంభమేళాలు, దేవాలయాలంటోంది
  • కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ దుర్వినియోగం చేస్తోంది

ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ నుంచి ఇటీవలే బయటకొచ్చిన సావిత్రి బాయి పూలే విమర్శలు గుప్పించారు. ఒకవైపు ఉద్యోగాలు, హక్కుల కోసం తాము పోరాడుతుంటే, యూపీ ప్రభుత్వం కుంభమేళాలు, దేవాలయాలంటూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.

కుంభమేళాలు, దేవాలయాలు దళిత, గిరిజన, ముస్లింలకు తిండిపెడతాయా? ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని పాలించేది రాజ్యాంగం తప్ప, దేవుడు, దేవాలయాలు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని అమలు చేస్తే దేశ ప్రగతిలో మార్పు వస్తుందని సూచించారు. ఈ సందర్భంగా యూపీలో శాంతిభద్రతలపైనా ఆమె విమర్శలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, ఈ విషయంలో సీఎం యోగి పట్టుసాధించలేకపోయారని విమర్శించారు.

More Telugu News