venkatesh: 'బిగ్ బాస్ 3' హోస్ట్ గా వెంకటేశ్?

  • 'బిగ్ బాస్' హోస్ట్ గా మెప్పించిన ఎన్టీఆర్ 
  • తనదైన స్టైల్లో ఆకట్టుకున్న నాని 
  • జూన్ నుంచి 'బిగ్ బాస్ 3'

తెలుగులో 'బిగ్ బాస్' సీజన్ 1కి  హోస్ట్ గా ఎన్టీఆర్ మెప్పించాడు. 'బిగ్ బాస్ 2'కి హోస్ట్ గా నాని ఆకట్టుకున్నాడు. ఇక 'బిగ్ బాస్ 3' కోసం విజయ్ దేవరకొండను రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వెంకటేశ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇటీవలే వెంకటేశ్ తో సంప్రదింపులు జరిపారనేది తాజా సమాచారం.

'బిగ్ బాస్' .. 'బిగ్ బాస్ 2' కార్యక్రమాలను యూత్ ఎక్కువగా చూశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ కార్యక్రమం పట్ల అంతగా ఆసక్తిని చూపడంలేదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందువలన ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వున్న వెంకటేశ్ ను హోస్ట్ గా రంగంలోకి దింపాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంతకుముందు హౌస్ లోని వాళ్లు నాని మాటలను పెద్దగా లెక్కచేయలేదనే విమర్శలు వున్నాయి. వెంకటేశ్ ను అనుకోవడానికి ఇదొక కారణమని అంటున్నారు. ఇంతవరకూ టీవీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వచ్చిన వెంకటేశ్, ఫస్టు టైమ్ ఈ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నాడని చెబుతున్నారు. జూన్ నుంచి 'బిగ్ బాస్ 3' మొదలుకానున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News