roll rida: నేను అనుకున్నది ఒకటి .. అయిందొకటి .. కౌశల్ ఆర్మీకి సారీ: రోల్ రైడా

  • కౌశల్ నాకు ఎంతో హెల్ప్ చేశాడు 
  • మా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం వుంది
  • కౌశల్ ఆర్మీ అర్థం చేసుకోవాలి  

'బిగ్ బాస్ 2' హౌస్ లో కౌశల్ ఒంటరిపోరాటం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కడిగా మిగిలిపోయిన రోల్ రైడాకి కూడా కౌశల్ సపోర్ట్ గా నిలిచి మరింత మంది మనసులను దోచుకున్నాడు. ఇక బయటికి వచ్చిన తరువాత డాక్టరేట్ అనీ .. గిన్నీస్ రికార్డ్ అని కౌశల్ ని కొంతమంది తప్పుదారి పట్టించారు. ఈ నేపథ్యంలోనే రోల్ రైడా 'రాదు రాదు' అనే ఒక సాంగ్ ను వదిలాడు. ఆ పాటలో 'ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేట్ వస్తదా ..' అనే లైన్ ఉండటం కౌశల్ మద్దతుదారుల అసహనానికి కారణమైంది.

దాంతో యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ వీడియోపై డిస్ లైక్స్ తో విరుచుకుపడ్డారు. ఈ విషయంపై రోల్ రైడా స్పందిస్తూ .. "ఈ మధ్య కాలంలో ట్రోల్ అయిన అంశాలపై ఈ సాంగ్ చేశాను .. కౌశల్ ను ట్రోల్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. కౌశల్ నాకు టాస్కుల్లో ఎంతో హెల్ప్ చేశాడు. మా ఇద్దరి మధ్యా మంచి సాన్నిహిత్యం వుంది. ఆయనని ట్రోల్ చేసి మా బంధాన్ని ఎందుకు చెడగొట్టుకుంటాను. నేను అనుకున్నది ఒకటి .. అయింది ఒకటి .. ఈ విషయాన్ని కౌశల్ ఆర్మీ అర్థం చేసుకోవాలి .. వాళ్లకి సారీ" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News