priya varier: ప్రియా వారియర్ 'లవర్స్ డే' ఫస్టులుక్

  • మలయాళంలో 'ఒరు ఆదార్ లవ్' 
  • తెలుగు టైటిల్ గా 'లవర్స్ డే'
  • ఫిబ్రవరి 14వ తేదీన విడుదల

ఒకే ఒక్క కన్నుగీటుతో ప్రియా వారియర్ కుర్రకారు మనసులను దోచేసుకుంది. 'ఒరు ఆదార్ లవ్' అనే మలయాళ సినిమాలో హీరోను చూసి ఆమె కన్నుగీటిన తీరు .. అందరి దృష్టిని ఆ సినిమా వైపుకు తిప్పింది. తెలుగులోనూ ప్రియా వారియర్ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకోగలిగింది. వాళ్లంతా కూడా ఈ సినిమా తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే వాళ్ల నిరీక్షణ ఫలించనుంది. ఒమర్ లులూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులోను విడుదల చేస్తున్నారు. 'లవర్స్ డే' అనే టైటిల్ తో ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. గురురాజ్ .. వినోద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి షాన్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన సంగీతం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. తెలుగులో ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి మరి. 

More Telugu News