Kajal Agarwal: కాజల్ టీజర్ పై విమర్శలు .. దర్శకుడి వివరణ

  • 'క్వీన్ రీమేక్ గా 'పారిస్ పారిస్'
  • ప్రధాన పాత్రధారిగా కాజల్ 
  • దర్శకుడిగా రమేశ్ అరవింద్  

హిందీలో ఆ మధ్య భారీ విజయాన్ని అందుకున్న 'క్వీన్' సినిమాను, దక్షిణాది భాషల్లో ఒకేసారిగా రూపొందిస్తున్నారు. ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ తో .. ఒక్కో హీరోయిన్ తో ఈ సినిమాను చేస్తున్నారు. తమిళంలో 'పారిస్ పారిస్' పేరుతో ఈ సినిమా నిర్మితమవుతోంది. కాజల్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న.. రమేశ్ అరవింద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవల వదిలిన ఈ టీజర్ లో కాజల్ కి సంబంధించిన ఒక బిట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దర్శకుడి వైఖరి పట్ల చాలామంది అసహనాన్ని వ్యక్తం చేశారు. దాంతో ఈ విషయంపై నటుడు .. దర్శకుడు రమేశ్ అరవింద్ స్పందించాడు. " టీజర్ లోని ఆ బిట్ చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. హిందీ సినిమాలోనూ ఈ బిట్ వుంది. టీజర్లో ఈ బిట్ తప్పుగా అనిపించవచ్చు. కానీ సినిమాను చూస్తున్నప్పుడు .. కథ వెనుకే వెళుతుంటాం కనుక తప్పుగా అనిపించదు. ప్రేక్షకులు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం వుంది" అని ఆయన చెప్పుకొచ్చాడు. 

More Telugu News