కరుణానిధి మృతితో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి ఈ నెల 28న ఉప ఎన్నిక

Tue, Jan 01, 2019, 09:29 AM
  • నాలుగు నెలలుగా ఖాళీగా తిరువరూర్ స్థానం
  • 10 నుంచి నామినేషన్ల స్వీకరణ
  • 28న ఎన్నిక.. 31న ఓట్ల లెక్కింపు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మృతితో ఖాళీ అయిన తిరువరూర్ స్థానానికి ఈ నెల 28న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి గతేడాది ఆగస్టులో కన్నుమూశారు.

గత నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి సోమవారం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ నెల 10 నుంచి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది.  

ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వాతావరణ సమస్యలు, పండుగల నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించలేకపోయామని ఈ సందర్బంగా ఈసీ పేర్కొంది. ఈ నెల 28న ఉప ఎన్నిక నిర్వహించనుండగా 31న ఓట్లను లెక్కించనున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad