Asian civet: పాలమూరు యూనివర్సిటీలో పునుగు పిల్లి.. హైదరాబాద్ జూపార్క్‌కు తరలింపు

  • రెండు పిల్లలకు జన్మనిచ్చిన పిల్లి
  • శేషాచలం కొండల్లో కనిపించే ఏషియన్ పాలం సీవెట్
  • తిరుమల శ్రీవారి సేవలో పునుగుపిల్లి తైలం

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ పరిసరాల్లో ఓ పునుగు పిల్లి కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది రెండు పిల్లలను ప్రసవించడంతో గమనించిన కొందరు విద్యార్థులు అది అడవి పిల్లి మాదిరిగా ఉండడంతో జువాలజీ అధ్యాపకుడు డాక్టర్ ఎన్.వేణుకు సమాచారం అందించారు. దీనిని పరిశీలించిన ఆయన పిల్లిని ఏషియన్ పాలం సీవెట్‌(పునుగు పిల్లి) గా పిలుస్తారని, ఇది ఎక్కువగా భారత్, శ్రీలంక, మయన్మార్, భూటాన్, థాయిలాండ్, సింగపూర్, కాంబోడియా, మలేషియా, జపాన్ దేశాల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు.

మన దేశంలో తిరుపతిలోని శేషాచలం అడవుల్లో ఇది కనిపిస్తుంది. ఈ పిల్లి తైలానికి ఎంతో విశిష్టత ఉంది. చాలా సువాసనతో ఉండే ఈ తైలాన్ని అభిషేకం అనంతరం తిరుమల శ్రీవారికి పూస్తారు. కాగా, పాలమూరు యూనివర్సిటీలో పునుగు పిల్లి ఉందన్న సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి రాములు వర్సిటీకి చేరుకుని పరిశీలించారు. వాటిని హైదరాబాద్ జూపార్క్‌కు తరలించనున్నట్టు తెలిపారు.

More Telugu News