Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఛాలెంజింగ్ పాత్రలో తమన్నా 
  • బాలకృష్ణతో అనిల్ రావిపూడి 
  • మోక్షజ్ఞ హీరోగా 'ఆదిత్య 369'?  

*  గ్లామరస్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం 'ఖామోషి' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. విశేషం ఏమిటంటే, ఇందులో తను మూగ, బధిర యువతిగా కనిపిస్తుంది. మరో విశేషం ఏమిటంటే, ఇందులో మేకప్ లేకుండా సహజంగా కనిపిస్తుందట. చక్రి తోలేటి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
 *  అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ చిత్రం చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించాడు. గత కొన్నాళ్లుగా ఈ ప్రాజక్టు గురించి బాలయ్యతో చర్చిస్తున్నానని, బహుశా బోయపాటి శ్రీను చిత్రం తర్వాత ఇది ఉండవచ్చని అనిల్ తెలిపాడు.
*  నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా 'ఆదిత్య 369' చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందని ప్రముఖ దర్శకుడు క్రిష్ చెప్పాడు. రానా నిర్వహిస్తున్న 'నెం1 యారి' టీవీ కార్యక్రమంలో పాల్గొన్న క్రిష్.. మోక్షజ్ఞ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయాన్ని చెప్పారు. కాగా, మోక్షజ్ఞను క్రిష్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేయనున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి విదితమే.   

More Telugu News