Andhra Pradesh: నిరుద్యోగులకు శుభవార్త.. పలు ఉగ్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విడుదల

  • పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి 7 నోటిఫికేషన్లు
  • మొత్తం 1,326 ఉద్యోగాలు
  • గ్రూప్- 1 కింద169, గ్రూప్- 2 కింద 446 పోస్టులు

మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో పలు ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,326 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆయా ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ ఏడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్- 1లో 169, గ్రూప్- 2లో 446 ఉద్యోగాలతో పాటు మొత్తం 1,326 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

గ్రూప్ -1 పోస్టులకు జనవరి 7 నుంచి 28 వరకు, గ్రూప్ 2 పోస్టులకు జనవరి 10 నుంచి 31 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 5న గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష, జులై 18,19 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 292,ఎగ్జిక్యూటివ్ పోస్టులు -154, సాధారణ పరిపాలన శాఖలో ఏఎస్ వో పోస్టులు -150, సీనియర్ అకౌంటెంట్లు- 20, ఎక్సైజ్ శాఖలో ఎస్సై పోస్టులు - 50, పంచాయతీరాజ్ శాఖలో ఎక్స్ టెన్షన్ అధికారులు -40, డిప్యూటీ తహసీల్దార్లు -16, ఖజనా శాఖలో సీనియర్ అకౌంటెంట్లు- 13, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 405 లెక్చరర్ పోస్టుల భర్తీకి, మత్స్య శాఖలోని 43 ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 305 లెక్చరర్ పోస్టులకు ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు, ఫిషరీస్ సబ్ సర్వీస్ లో 10 అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8 వరకు, ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టులకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపాలని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వివరించింది.

More Telugu News