nani: న్యూ ఇయర్ కానుకగా వచ్చిన 'జెర్సీ' ఫస్టులుక్

  • షూటింగు దశలో 'జెర్సీ'
  • క్రికెట్ నేపథ్యంలో సాగే కథ 
  • 2019 ఏప్రిల్ 19న విడుదల 

ప్రస్తుతం నాని కథానాయకుడిగా 'జెర్సీ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో కొనసాగుతుంది .. నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. క్రికెటర్ లుక్ తో నాని ఆకట్టుకుంటున్నాడు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, నాని సరసన కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. నానికి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దాంతో కొత్త సంవత్సరంలో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది గనుక, తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో ఆయన వున్నాడు. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News