balakrishna: దూసుకుపోతోన్న ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్

  • ఎన్టీఆర్ బయోపిక్ పై పెరుగుతోన్న ఆసక్తి
  • ప్రత్యేక ఆకర్షణగా బాలకృష్ణ గెటప్స్ 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి     

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడుగా.. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన 'కథానాయకుడు' .. ఫిబ్రవరి 7వ తేదీన 'మహానాయకుడు'ను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇదే వేదికపై ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి ఇంతవరకూ 10 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

ఈ వ్యూస్ ను బట్టి ఈ సినిమాపట్ల ఏ స్థాయిలో అంతా ఆసక్తిని చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, బుర్రా సాయిమాధవ్ సంభాషణలు సమకూర్చారు. బాలకృష్ణ గెటప్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక .. రానా ... సుమంత్ .. కల్యాణ్ రామ్ ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. 

More Telugu News