శ్రీనివాసుని సన్నిధిలో మూడువేల పెళ్లిళ్లు!

Tue, Feb 12, 2013, 06:36 PM

తిరుమల కొండ పెళ్లి కళతో కళకళలాడుతోంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉండడంతో తిరుమల శ్రీవారి సన్నిధిలో మూడువేలకు పైగా జంటలు ఒకటి కాబోతున్నాయిఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

ఆ మూడు రోజులు కొండపైకి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండపాలను ముస్తాబు చేయడం, వసతి గదుల కేటాయింపు, మంచినీటికి ఎద్దడి లేకుండా చూడడం... వంటి సౌకర్యాలను సమకూరుస్తున్నారు.  
Tags:
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement