surya: సూర్య తదుపరి సినిమా టైటిల్ పై ఆసక్తి

  • సూర్య 36వ సినిమాగా 'ఎన్జీకే'
  • 37వ సినిమా కేవీ ఆనంద్ తో 
  • సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్

తమిళ .. తెలుగు భాషల్లో సూర్యకి మంచి క్రేజ్ వుంది. త్వరలోనే ఆయన 'ఎన్జీకే' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, కేవీ ఆనంద్ దర్శకత్వం వహించే సినిమాతో సూర్య బిజీగా వున్నాడు .. ఇది సూర్యకి 37వ సినిమా.

మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ అర్ధరాత్రి దాటిన తరువాత అంటే 12:10 నిమిషాలకి ఈ సినిమా టైటిల్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. 'నిన్ను కాపాడేవాడే ఇంకొకరి చావుకి కారకుడవుతాడు' అనే వాక్యంతో వదిలిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. 

More Telugu News