Kadapa District: మొక్కు తీర్చుకున్న తరువాత సీఎం రమేష్ ఇలా!

  • ఎన్డీయే పనిని టీడీపీ సర్కార్ ప్రారంభించింది
  • పార్లమెంట్ లో మోదీని ఎండగడతా
  • స్థానికులకే అత్యధిక ఉద్యోగాలన్న రమేశ్

కడప ఉక్కు కర్మాగారం కల సాకారమయ్యేంత వరకూ తాను గడ్డం గీయించుకోనని ప్రతిజ్ఞ చేసిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఇటీవల ముఖ్యమంత్రి అందుకు శంకుస్థాపన చేయడంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. తన మొక్కులను చెల్లించుకున్న తరువాత స్వామి ఆలయం నుంచి వెలుపలికి వచ్చిన తరువాత సీఎం రమేశ్ మాట్లాడుతూ, ఎన్డీయే సర్కారు చేయాల్సిన పనినిన చంద్రబాబు ప్రభుత్వం మొదలు పెట్టిందని, ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించి, నరేంద్ర మోదీ తప్పిదాలను ఎండగడతానని అన్నారు. తన ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ వస్తే, అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఉక్కు పరిశ్రమ వస్తుంటే స్వాగతించాల్సిన విపక్షాలు, విమర్శలు చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు.

More Telugu News