modi: ప్రధాని హోదాలో ఉంటూ బాధ్యత మరిచి మాట్లాడుతున్నారు.. దేశానికి దౌర్భాగ్యం: మోదీపై కుమారస్వామి ఫైర్

  • 60 వేల మంది రైతులకు రుణమాఫీ చేశాం
  • వారం రోజుల్లో లక్ష మందికి రుణమాఫీ చేయనున్నాం
  • దేశ ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా మోదీ మాట్లాడుతున్నారు

కర్ణాటకలో రైతు రుణమాఫీకి సంబంధించి ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలు దారుణమని... దేశానికి దౌర్భాగ్యం వంటివని అన్నారు. రైతులకు కర్ణాటక ప్రభుత్వం ఏదేదో చేస్తామని చెప్పి, చివరకు లాలీపాప్ ఇచ్చిందని... లక్షలాది మంది రైతులు ఉంటే, కేవలం 800 మందికి మాత్రమే రుణమాఫీ చేశారని ప్రధాని విమర్శించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కుమారస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రజలను తప్పు దారి పట్టించే విధంగా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రైతు రుణమాఫీ సమాచారం ఆన్ లైన్ లో ఉందని తెలిపారు. అర్హులైన రైతులకు నేరుగా రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 60వేల మంది రైతులకు రూ. 350 కోట్ల రుణమాఫీని చేశామని తెలిపారు. మరో వారం రోజుల్లో లక్ష మందికి రుణమాఫీ చేయనున్నామని చెప్పారు. వాస్తవాలను తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ... ప్రధాని హోదాలో ఉన్న మోదీ బాధ్యతను మరిచి వ్యాఖ్యానిస్తున్నారంటూ మండిపడ్డారు. 

More Telugu News