నా తండ్రిని కోల్పోయాను: హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్

31-12-2018 Mon 09:33
  • రషీద్ ఖాన్ తండ్రి కన్నుమూత
  • ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆఫ్గన్ ఆటగాడు
  • సంతాపం తెలిపిన క్రికెట్ ప్రపంచం
గడచిన ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ఆడి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆఫ్గనిస్థాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన రషీద్, "నేడు నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను. నేను ధైర్యంగా ఉండాలని మీరెప్పుడూ అంటుంటారు. ఆ మాటలు ఎందుకు చెబుతుంటారో ఇప్పుడు అర్థమైంది. మీరులేని నష్టాన్ని నేను భరించాలి. నా మనసులో ఎల్లప్పుడూ ఉంటావు నాన్నా... ఐ మిస్ యూ" అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను చూసిన క్రికెట్ ప్రపంచం రషీద్ ఖాన్ కు అండగా నిలిచి ధైర్యం చెప్పింది. క్రికెటర్లు మహమ్మద్ నబీ, డీన్ జోన్స్, యూసుఫ్ పఠాన్ తదితరులు సంతాపం తెలిపారు.