New Delhi: 2018 చివరి రోజు కూడా తగ్గిన పెట్రోలు ధర... ఈ నెలలో రూ. 4కు పైగా తగ్గుదల!

  • ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 68.84
  • ముంబైలో రూ. 74.47
  • అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు

ఈ సంవత్సరం చివరి రోజుకూడా పెట్రోలు, డీజెల్ ధరలు తగ్గాయి. ఈ సంవత్సరంలోనే అత్యంత తక్కువ ధరకు 'పెట్రో' ఉత్పత్తులు దిగివచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 68.84కాగా, డీజెల్ ధర రూ. 62.86కు తగ్గింది. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు, డీజెల్ ధరలు లీటరుకు వరుసగా  రూ. 74.47, రూ. 65.76గా ఉంది.

కాగా, మూడు నెలల క్రితం పెట్రోలు ధర ముంబైలో రూ. 90ని దాటిన సంగతి తెలిసిందే. ఆపై ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడం, ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పతనం కారణంగా, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చాయి. మొత్తం మీద డిసెంబర్ నెలలో పెట్రోలు, డీజెల్ ధరలు రూ. 4పైనే తగ్గినట్లయింది. ఇరాన్ పై అమెరికా ఆంక్షలను సడలించడం ప్రారంభించిన తరువాత, క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి.

More Telugu News