Chiranjeevi: మనవరాలిని ఎత్తుకుని మురిసిపోతున్న చిరంజీవి దంపతులు!

  • శ్రీజ, కల్యాణ్ దేవ్ లకు బిడ్డ
  • 25న పాపకు జన్మనిచ్చిన శ్రీజ
  • తాతయ్య, అమ్మమ్మల చేతుల్లో పాప

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల రెండో కుమార్తె శ్రీజ‌, క‌ల్యాణ్ దేవ్ లకు ఈ నెల 25, మంగ‌ళ‌వారం నాడు పండంటి పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని క‌ల్యాణ్ దేవ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు వెల్లడిస్తూ, పాప కాలిముద్రల ఫోటోను కూడా పోస్ట్ చేశారు. మెగాభిమానులంతా ఈ పాప తొలి చిత్రాన్ని ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న వేళ, తాతయ్య, అమ్మమ్మల చేతుల్లో పాప ఉన్న చిత్రం ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. తమ గారాల మనవరాలిని ఎత్తుకుని మురిసిపోతున్నారు చిరంజీవి దంపతులు.




More Telugu News