Bigg Boss: సోషల్ మీడియా లీక్... బిగ్ బాస్ సీజన్ - 12 విన్నర్ క్రికెటర్ శ్రీశాంత్ అట!

  • మరికొన్ని గంటల్లో ముగియనున్న సీజన్
  • టాప్-2లో దీపిక, శ్రీశాంత్
  • సోషల్ మీడియాలో ప్రచారం

హిందీ బిగ్ బాస్ సీజన్ - 12 మరికొన్ని గంటల్లో ముగిసిపోనుంది. సుమారు మూడు నెలల పాటు అత్యంత వివాదాస్పదంగా సాగిన గేమ్ షోలో ఈ దఫా విజేతగా క్రికెటర్ శ్రీశాంత్ నిలిచాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫైనల్ కంటెస్టెంట్ లుగా శ్రీశాంత్ తో పాటు దీపికా కక్కడ్ ఇబ్రహీం, దీపికా ఠాకుర్, కరణ్ వీర్ బోహ్రా, రోమిల్ చౌధరి ఉండగా, టాప్ - 2లో దీపికా కక్కడ్, శ్రీశాంత్ ఉన్నారని, విన్నర్ గా శ్రీశాంత్ నిలిచారని సమాచారం. ఈ సస్పెన్స్ పోవాలంటే నేటి రాత్రి వరకూ వేచి చూడక తప్పదు.

More Telugu News