Dasari Narayanarao: గాయని తన గొంతును అమ్ముకోవడం లేదా?... శరీరాన్ని అమ్ముకుంటే వ్యభిచారం ఎలా అవుతుంది?: రామ్ గోపాల్ వర్మ

  • మీటూ ఉద్యమంపై స్పందించిన వర్మ
  • మగాడి నైజం మారబోదని వ్యాఖ్య
  • శృంగారం చట్టబద్ధం చేసిన దేశాల్లో తక్కువ నేరాలు
  • దాసరి సినిమాలోని డైలాగులు గుర్తు చేసిన వర్మ

సినిమాలతో పాటు ట్విట్టర్ ఖాతాలో చేసే వ్యాఖ్యలతోనూ సంచలనాలు రేపుతుండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, మీటూ ఉద్యమంపై స్పందించారు. ఈ ఉద్యమం వల్ల అమ్మాయిలకు కొంత వరకూ ఉపయోగం ఉంటుందని చెప్పిన వర్మ, కష్టం ఎదురైతే ఎలా స్పందించాలన్న విషయమై వాళ్లకు కొంత అవగాహన ఏర్పడిందన్నారు .

అయితే, పరిస్థితి మారుతుందని మాత్రం తాను అనుకోబోవడం లేదని, మగాడి నైజం మారబోదని అన్నారు. తన దృష్టిలో ఓ యాక్షన్ సినిమా చూసినా, పోర్న్ సినిమా చూసినా ఒకటేనని, పొగ తాగితే, మద్యం తాగితే వ్యక్తి చనిపోతాడే తప్ప, పోర్న్ సైట్ చూస్తే చావడని అన్నారు. అనైతికం, తప్పు అంటూ కొన్నింటిని ప్రజలపై రుద్దేస్తున్నారని, శృంగారాన్ని చట్టబద్ధం చేసిన దేశాల్లో నేరాల శాతం తక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయని అన్నారు.

ఈ సందర్భంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'కల్యాణి' చిత్రంలోని ఓ డైలాగును వర్మ గుర్తు చేశాడు. "ఆ సినిమాలో ఓ గాయని తను పాడిన పాటకు డబ్బులు తీసుకుంటుంది. గొంతుని అమ్ముకుని సొమ్ము చేసుకున్నప్పుడు శరీరాన్ని అమ్ముకుంటే అది వ్యభిచారం ఎలా అవుతుంది? అనే డైలాగ్‌ కూడా ఉంది" అన్నారు. ఓ రకంగా ఆలోచిస్తే, ప్రపంచంలో ఏదీ నేరం కాదని, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన దేశాలే అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని చెప్పారు. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు వ్యక్తిగత స్వేచ్ఛను పెంచేలా ఉన్నాయని వర్మ అభిప్రాయపడ్డారు.

More Telugu News